Breaking News

టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం.. పోలీసుల కేసు నమోదు

Published on Sat, 09/14/2024 - 17:33

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించడంతో శుక్రవారం జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఆప్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని సీఎంకు ఘన స్వాగతం పలికారు.

కాగా సీఎం విడుదలపై ఆప్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.  నార్త్‌ ఢిల్లీలోని సివిల్స్‌ లైన్స్‌లో సీఎం ఇంటి వద్ద పెద్ద ఎత్తున టపాలు కాల్చి కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం నివాసం వెలుపల బాణాసంచా పేల్చడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

బాణసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223  కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారి తెలిపారు.

ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక స్వాగతం పలికేందుకు ఆయన నివాసం వెలుపల పటాకులు పేల్చడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.
చదవండి: దంచికొట్టిన వానలు.. మెరుగుపడిన ఢిల్లీ గాలి నాణ్యత

కాగా లిక్కర్‌ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. రూ.10లక్షల బాండ్‌ సమర్పించాలని, కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని.. కేసు విచారణ కోసం ట్రయల్‌ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)