Breaking News

24 ఏళ్ల కిందటి కేసు.. మేధా పాట్కర్‌ అరెస్టు

Published on Fri, 04/25/2025 - 12:26

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా(VK Saxena) సుమారు 24 ఏళ్ల కిందట దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అంతకుముందు, ఈ కేసుకు సంబంధించిన ప్రొబేషన్ బాండ్ అమలు ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న పాట్కర్ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో క్రవారం నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. మేధా పాట్కర్‌ అరెస్ట్‌ను సౌత్‌ఈస్ట్‌ డీసీపీ రవి కుమార్‌ సింగ్‌ ధృవీకరించారు. మధ్యాహ్నం ఆమెను సాకేత్‌ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కిందటే ఢిల్లీ సాకేత్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో న్యాయ స్థానం నుంచి మేధా పాట్కర్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, కోర్టు ఆదేశాలను ఆమె ఉల్లంఘించారని, ప్రొబేషన్‌ బాండ్‌ సమర్పించలేదని, రూ. లక్ష జరిమానా చెల్లించలేదంటూ వారెంట్‌లో పేర్కొంది. 

నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వినయ్‌ కుమార్‌ సక్సేనా(VK Saxena)పై ఆమె అప్పట్లో కేసు వేశారు. అప్పుడు ఆయన అహ్మదాబాద్‌ కేంద్రంగా ఉన్న ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు సక్సేనా మద్దతు ఇచ్చారు.  అయితే ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు.

సక్సేనా పిరికిపంద అని, హవాలా లావాదేవీల్లో ఆయన హస్తం ఉందని ఆరోపించారామె. నవంబర్‌ 5, 2000 సంవత్సరంలో మేధా పాట్కర్‌ వీకే సక్సేనాపై వ్యాఖ్యలు చేయగా.. పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తోచ్చింది. అంతేకాదు.. కిందటి ఏడాది జులై1వ తేదీన ఆమె ఐదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే నెల ఆఖరులో ఆ శిక్షను రద్దు చేస్తూ పలు షరతుల మీద న్యాయమూర్తి మేధా పాట్కర్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. అయితే ఆ షరతులను ఉల్లంఘించడంతోనే కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు