Breaking News

‘జంతర్‌ మంతర్‌’ ఎఫెక్ట్‌: మందుబాబులకు షాక్‌!

Published on Sat, 07/25/2026 - 09:46

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వారాంతపు రోజుల్లో మద్యం దుకాణాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని మద్యం దుకాణాలను వారాంతం వరకు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ దుకాణాలు, భద్రతా కారణాల రీత్యా ముందుగానే మూతపడనున్నాయి.

పోలీసుల నుంచి అందిన భద్రతా సమాచారం ‍ప్రకారం నిఘా వర్గాల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గురువారం నాడు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసు ఇవ్వకుండానే దుకాణాలు అకస్మాత్తుగా ముందుగానే మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారాంతం ముగిసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనల కారణంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మద్యం దుకాణాల సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో వారాంతంలో మద్యం ప్రియులకు నిరాశ ఎదురుకానుంది.

ఇది కూడా చదవండి: గుండెకు సొంత ‘మెదడు’.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి!

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)