Breaking News

ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

Published on Mon, 03/06/2023 - 14:32

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టు షాకిచ్చింది. ఇప్పటికే వారం రోజులు సీబీఐ కస్టడీలో ఉన్నఆయనకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. దీంతో అధికారులు సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు. ఈనెల 20 వరకు ఆయన రిమాండ్‌లోనే ఉండనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత ఆదివారం(ఫిబ్రవరి 26) సిసోడియాను 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు అనంతరం అరెస్టు చేశారు. ఆ మరునాడే కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ విధించింది. అనంతరం మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టగా మరో రెండు రోజులు కస్టడీ విధించింది.  ఈ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపట్టారు.

ఈసారి కస్టడీ కాకుండా జ్యుడీషియల్ రిమాండ్ కోరారు. న్యాయస్థానం ఇందుకు అనుమతి ఇవ్వడంతో సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు. కాగా.. సిసోడియా ఇప్పటికే బెయిల్  కోసం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 10న దీనిపై విచారణ చేపడతామని న్యాయస్థానం చెప్పింది.
చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)