Breaking News

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్‌షీట్‌ దాఖలు

Published on Thu, 02/02/2023 - 16:43

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో సంచలనం చోటుచేసుకుంది. లిక్కర్‌ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రెండో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీలోని రోజ్‌ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది వివరంగా తెలిపింది.

చార్జ్‌షీట్‌లో చేర్చిన 17 మంది వ్యక్తులు, సంస్థల పేర్లు:
A1 - సమీర్‌ మహేంద్రు
A2 - సమీర్‌కు చెందిన రెస్టారెంట్‌ ఖావోగాలి
A3 - సమీర్‌కు చెందిన బబ్లీ బేవరేజేస్‌
A4 - సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్‌
A5 - సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌
A6 - విజయ్‌ నాయర్‌
A7 - శరత్‌ చంద్ర
A8 - శరత్‌కు చెందిన ట్రైడెంట్‌ చెంపార్‌
A9 - శరత్‌కు చెందిన అవంతిక కాంట్రాక్టర్స్‌
A10 - శరత్‌కు చెందిన అర్గనామిక్స్‌ ఎకోసిస్టమ్స్‌
A11 - బినయ్‌ బాబు
A12 - రాజేశ్‌ మిశ్రాకు చెందిన పెర్నార్డ్‌ రికర్డ్‌
A13 - అభిషేక్‌ బోయిన్‌పల్లి
A14 - అమిత్‌ అరోరా
A15 - అమిత్‌కు చెందిన KSJM స్పిరిట్స్‌
A16 - అమిత్‌కు చెందిన బడ్డీ రిటైల్స్‌
A17 - అమిత్‌కు చెందిన పాపులర్‌ స్పిరిట్స్‌

ఆప్‌కు వంద కోట్ల ముడుపులు
కోర్టులో దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో కుట్ర జరిగిన తీరును ఈడీ సవివరంగా పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వంద కోట్ల ముడుపులు ఆమ్‌ అద్మీ పార్టీకి చేరాయని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును కూడా ఇందులో పేర్కొంది. లంచంగా వచ్చిన వంద కోట్లను గోవా ఎన్నికల్లో ఆమ్‌ అద్మీ పార్టీ ఉపయోగించిందని ఆరోపించింది. గోవాలో పార్టీ వాలంటీర్లుగా పని చేసిన వారి కోసం ఈ డబ్బు ఖర్చు చేసినట్టు పేర్కొంది.

చార్జ్‌షీట్‌లో సీఎం కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేర్లు
ఇక ఇదే ఛార్జ్ షీట్‌లో కుట్ర గురించి వివరించిన ఈడీ ఓ చోట ఎమ్మెల్సీ కవిత గురించి ప్రస్తావించింది. నవంబర్‌ 12, 2022న అరుణ్‌పిళ్లైని విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని పేర్కొంది. అరుణ్‌ పిళ్లై.. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఇండో స్పిరిట్స్‌లో పార్ట్‌నర్‌గా చేరారని తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన రెండు ఫోన్ నెంబర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నెంబర్లను ఏ ఏ సమయంలో వాడారో కూడా తేదీల వారీగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేర్లలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది ఈడీ.

అలాగే ఎంపీ మాగుంట పేరు కూడా ఈడీ చార్జ్‌షీట్‌లో ఉంది. ఒబెరాయ్‌ హోటళ్లో కుట్రకు సంబంధించిన వ్యవహారమంతా జరిగిందని తెలిపింది. ఆమ్‌ అద్మీ పార్టీతో కవితకు పూర్తి సమన్వయం ఉందని, ఢిల్లీలో మద్యం షాపులకు ముఖ్యంగా L1 షాపులను దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో పలు మార్లు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వచ్చారని ఈడీ తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. లంచం ఇచ్చే వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పని పూర్తయ్యేలా చేశారని ఈడీ ఆరోపించింది. 


చదవండి: పోలవరంపై ఎంపీ వంగా గీత ప్రశ్న.. కేంద్రమంత్రి సమాధానమిదే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)