Breaking News

2023.. న్యూ ఇయర్‌ వేళ.. ఢిల్లీలో జరిగిన ఘోరమిదే!

Published on Wed, 12/27/2023 - 14:01

అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్‌ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన.

ఒక హోటల్‌ జరిగిన న్యూ ఇయర్‌  పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. 

ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్‌పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు.

పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే  ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. 

ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో  అమిత్ ఖన్నా, అశుతోష్‌లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. 
ఇది కూడా చదవండి: 2023లో ‍ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)