ఢిల్లీ అగ్నిప్రమాదం: కుక్‌ నిర్లక్ష్యమే కొంపముంచిందా?

Published on Sat, 06/06/2026 - 12:12

న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలోని మాలవీయ నగర్ ‘ఫ్లరిష్ ఇన్’ హోటల్‌లో 21 మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ వంటవాడు (కుక్) కేశవ్ నేగిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతని నిర్లక్ష్యం  కారణంగానే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, హోటల్‌లోని ఎలక్ట్రానిక్ తలుపులు లాక్ అయిపోయి, పెను విషాదానికి దారితీసిందని పోలీసు వర్గాల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

ఒకే ఒక్క స్విచ్ కారణంగా..
పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కిచెన్‌లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన కుక్ కేశవ్ నేగి, హోటల్ మెయిన్ పవర్ స్విచ్ (ఎలక్ట్రిసిటీ సప్లై)ను పూర్తిగా ఆఫ్ చేసి, దట్టమైన పొగల మధ్య నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పారిపోయాడు. ఆయన తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే హోటల్‌లో ఉన్నవారికి మృత్యుపాశంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్‌లోని సెన్సార్ ఆధారిత ఎలక్ట్రానిక్ తలుపులన్నీ జామ్ అయిపోయాయి. లోపల ఉన్న బాధితులు బయటకు వచ్చే మార్గం లేక లోపలే చిక్కుకుపోయారు.

బాత్‌రూమ్‌లోనే భార్యాభర్తల సజీవ దహనం
ఈ ప్రమాదంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు వెలుగుచూశాయి. పవర్ కట్ కావడంతో తలుపులు తెరుచుకోక, దట్టమైన పొగలు హోటల్ అంతటా కమ్మేశాయి. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి (సీల్డ్) ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకోలేక విలవిలలాడారు. ఓ జంట (భార్యాభర్తలు) ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లగా, అక్కడ కూడా డోర్ లాక్ అయిపోయింది. బయటకు రాలేక, ఊపిరాడక వారు అక్కడికక్కడే మరణించారు. నేగి చేసిన నిర్లక్ష్యపు పనే ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి ప్రధాన కారణమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.

ముమ్మరంగా సాగుతున్న పోలీసు విచారణ
అగ్ని ప్రమాదం జరిగిన ఐదు అంతస్తుల ఈ ఇరుకైన భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్ నడుస్తుండగా, బేస్‌మెంట్, పై అంతస్తులను హోటల్‌గా ఉపయోగిస్తున్నారు.  హోటల్ యజమాని లవకేష్ బజాజ్‌ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా, తాజాగా కుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై  లోతుగా దర్యాప్తు చేయడానికి హోటల్ సిబ్బందిని, ఇతర నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)