Breaking News

ఢిల్లీ హై అలర్ట్: ఈ ఆరుగురు ఉగ్రవాదులు కనిపిస్తే..

Published on Thu, 01/22/2026 - 10:11

న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు.

దీనిలో ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్‌)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు. కాగా కర్తవ్య పథ్,  న్యూఢిల్లీ జిల్లా అంతటా విస్తృతమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గణతంత్ర వేడుకల భద్రత కోసం సుమారు 10 వేల మంది పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించినట్లు న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ మహాలా తెలిపారు.

ఢిల్లీ సరిహద్దులు, జిల్లా చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. భద్రతా సిబ్బందితో ఇప్పటికే తొమ్మిది రౌండ్ల బ్రీఫింగ్, రిహార్సల్స్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్‌క్లోజర్‌లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. ఆహ్వానితులు తమ పాస్‌లపై ఉన్న సూచనలను గమనించి, నిర్దేశిత మెట్రో స్టేషన్లను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.  

ఇది కూడా చదవండి: ఏఐ వాడకుంటే ‘ఫెయిల్’.. టెక్కీ ఇంటర్వ్యూ వైరల్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)