షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!
Breaking News
ఆస్పత్రికి తరలింపు సరైందే
Published on Mon, 07/20/2026 - 06:18
సాక్షి, న్యూఢిల్లీ: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఆగమేఘాల మీద పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదివారం సమరి్థంచింది. తరలింపు నిర్ణయంలో ప్రభుత్వ ఏకపక్ష ధోరణి కన్పించట్లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ వ్యాఖ్యానించారు. సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో వాంగ్చుక్కు అందిస్తున్న వైద్య చికిత్సలో జోక్యం చేసుకునేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది.
ఆయన్ను ఆస్పత్రిలో చికిత్సపేరిట అక్రమంగా నిర్బంధించారన్న వాదనను కోర్టు తోసిపుచి్చంది. ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేసి, కుటుంబం కోరుకున్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్పై ఆదివారం అత్యవసర విచారణ చేపట్టింది. వాంగ్చుక్ ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని, ఎలక్ట్రోలైట్లను తీసుకునేందుకు ఆయన సమ్మతించారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన శారీరక స్వేచ్ఛ హక్కుకు ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేశారు. వాంగ్చుక్ కుటుంబ సభ్యులకు రోజంతా ఆయనను కలిసే అవకాశం కల్పించామని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ కోర్టుకు తెలిపారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. వాంగ్చుక్ వైద్య నివేదికలను కుటుంబ సభ్యులకు అందజేయాలని కోర్టు ఆదేశించారు. అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసి కేసు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేశారు. కాగా పరీక్ష పత్రాల లీకేజీలను నిరసిస్తూ 20వ తేదీన సీజేపీ పిలుపునిచి్చన ‘చలో పార్లమెంట్ ర్యాలీ’ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా ఉద్యమకారుడు వాంగ్చుక్ అభివర్ణించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో ఉన్న వాంగ్చుక్ సొంతంగా రాసి, సంతకం చేసిన లేఖను భార్య గీతాంజలి ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
Tags : 1