ఢిల్లీ మద్యం కేసులో బినోయ్‌కి బెయిల్‌

Published on Sat, 12/09/2023 - 06:07

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం విధానం కేసులో నిందితుడు హైదరాబాద్‌ వ్యాపారవేత్త బినోయ్‌బాబుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బినోయ్‌ బెయిల్‌ దరఖాస్తుపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. బినోయ్‌బాబుపై ఎలాంటి అభియోగాలు మోపకుండా 13 నెలలపాటు జైలులో ఉంచినందుకు ఈడీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘ఈడీ తీరు సరికాదు.

వ్యక్తుల్ని ఎక్కువ కాలం ముందస్తు నిర్బంధంలో ఉంచలేరు. ఈ కేసు ఇంకా ఎంతకాలం సాగుతుంది తెలియదు. బినోయ్‌బాబుపై మోపిన ఆరోపణలకు సంబంధించి ఈడీ, సీబీఐ వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం బినోయ్‌కి బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రముఖ మద్యం తయారీదారు పెర్నోడ్‌ రికర్డ్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న బినోయ్‌బాబు, విజయ్‌ నాయర్‌లను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్‌ చేసింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)