Breaking News

Gen Z: ఉదయం ఉద్యోగంలో చేరి.. మధ్యాహ్నానికే ‘గుడ్‌బై’!

Published on Wed, 08/20/2025 - 20:20

ఢిల్లీ: వామ్మో..నేను బతుకుంటే.. బలుసాకైనా అమ్ముకుని బతికేస్తా.. కానీ మీ కంపెనీలో మాత్రం ఉద్యోగం చేయను బాబోయ్‌ అంటూ ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే..లంచ్‌ టైంలో జాబ్‌కు రిజైన్‌ చేసి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్‌ కంపెనీల్లో టాక్సిక్‌ వర్క్‌ కల్చర్‌కు అద్దం పడుతోంది.  

సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది.ఆ ట్వీట్‌ సారాశం ఏంటంటే?. నా స్నేహితుడు ఢిల్లీకి చెందిన స్టార్టప్‌లో చేరాడు. చేరిన తొలిరోజు లంచ్‌ టైం వరకు పనిచేశాడు. లంచ్‌ టైం తర్వాత తన ల్యాప్‌ట్యాప్‌ను కూడా డెస్క్‌పై వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. ఆఫీస్ నుంచి వెళ్లిన తర్వాత..సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్స్‌ చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్‌ వాటికి రిప్లయి ఇవ్వలేదు.కానీ చివరికి కంపెనీ హెచ్‌ఆర్‌ నుంచి ఫోన్‌ రావడంతో రిప్లయి ఇవ్వక తప్పలేదు. హెచ్‌ఆర్‌తో బతుకుంటే బులుసాకైనా అమ్ముకుంటా కానీ మీ కంపెనీలో నేను పని చేయనని తేల్చి చెప్పాడు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఆ ట్వీట్‌పై నెటిజన్లు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. చేరిన తొలిరోజే ఉద్యోగానికి రిజైన్‌ చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. స్టార్టప్ కల్చర్‌లో  ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబే. ఇది ఆశ్చర్యకరం కాదు. స్టార్టప్ కల్చర్ కొన్నిసార్లు తట్టుకోలేని విధంగా ఉంటుంది.మొదటి రోజే వర్క్‌ ప్లేస్‌ సరిగా అనిపించకపోతే,వెళ్లిపోవడం మంచిదే’అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. చాలా మంది ప్లాన్ చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అమలు చేస్తారు’అంటూ మరో నెటిజన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సంఘటన జెన్‌జీ వర్క్‌ కల్చర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జెన్‌జీకి వర్క్‌ కల్చర్‌ బాగుండాలి. అంటే పనిచేసే కార్యాలయం తమ మనసుకు అనుగుణంగా ఉంటే ఫర్లేదు. లేదుంటే మానసిక ప్రశాంతను చెడగొట్టుకుని పనిచేకపోవడం ఇష్టం ఉండదు. అందుకే వెంటే రాజీనామా చేస్తారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)