Breaking News

దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు

Published on Mon, 06/02/2025 - 08:15

న్యూఢిల్లీ: గాలిలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది.  విపరీతమైన దుమ్ము తుఫాను(Dust storm) కారణంగా రాయ్‌పూర్ - ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడే వరకు ఇండిగో విమానం 6ఈ 6313 కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఉదంతాన్ని ఒక  ​​ప్రయాణికుడు వీడియోలో రికార్డు చేశారు.

ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నెలకొన్న తీవ్రమైన దుమ్ము తుఫాను కారణంగా రాయ్‌పూర్-ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)లో చోటు చేసుకున్న ఈదురుగాలులు, దుమ్ము తుఫాను  మధ్య పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేసి పరిస్థితులు మెరుగుపడే వరకు గాలిలో విమానాన్ని వృత్తాకారంలో తప్పుతూ వచ్చారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నప్పుడు చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న  దృశ్యం వీడియోలో కనిపించింది.
 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ మేరకు ఉంది. కాగా(సోమవారం)తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా బలమైన గాలులు వీచాయి. కాగా మే చివరి మూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించాయి. 

ఇది కూడా చదవండి: అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్‌’.. బాంబు దాడి కలకలం
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు