Breaking News

Delhi Chalo: ఢిల్లీలో ‘మహా పంచాయత్‌’కు రైతుల పిలుపు

Published on Wed, 03/06/2024 - 09:38

న్యూఢిల్లీ:  పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్‌ ఢిల్లీ ఛలో బుధవారం(మార్చ్‌ 6) ఉదయం మళ్లీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఢిల్లీలో కలుసుకోవడానికి రైతు సంఘాలు ప్లాన్‌ చేశాయి. అయితే తమ డిమాండ్లపై మార్చ్‌ 14న ఢిల్లీలో మహా పంచాయత్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతుసంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్‌, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ను ఫిబ్రవరిలోనే  ప్రారంభించారు.

అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్‌ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్‌ను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే  టిక్రీ,సింగు, ఘాజీపూర్‌ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు.

ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్‌ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్‌ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి.   

ఇదీ చదవండి.. రాహుల్‌ గాంధీకి ఊహించని అనుభవం

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు