Breaking News

Delhi Car Blast: ఎవరీ మేడమ్ X, మేడమ్‌ Z?

Published on Mon, 11/17/2025 - 15:44

ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో హ్యుందయ్‌ ఐ20లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్‌కు.. భారత్‌లోని జైషే మహమ్మద్‌ నెట్‌వర్క్‌ స్థాపించేందుకు చేసే ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ఉగ్రవాది డాక్టర్‌ షాహిన్‌ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో పాటు ఇతర ఉగ్రకుట్రకు సంబంధింత అంశాల్లో అనుమానాస్పద వ్యక్తులతో చేసిన చాటింగ్‌, అందుకు ఉపయోగించిన కోడ్‌ సైతం వెలుగులోకి వచ్చింది.  

ఢిల్లీ పేలుడు ఘటనతో పాటు జైషే మహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో డాక్టర్‌ షాషిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు ఆమె కదలికలు, ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డాక్టర్‌ షాహిన్‌ ఫోన్‌ నుంచి సేకరించిన వాట్సప్‌లో కీలక ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు. 

మేడమ్ X,మేడమ్ Z 
వాటిల్లో మేడమ్ X,మేడమ్ Z పేరుతో సేవ్‌ చేసిన మహిళలతో షాషిన్‌ మాట్లాడినట్లు తేలింది.  అదే సమయంలో ఈ రెండు నంబర్ల నుండి డాక్టర్ షాహీన్‌కు క్రమం తప్పకుండా కాల్స్, మెసేజ్‌లు వచ్చేవి. ఆ మెసేజ్‌లలో ‘మెడిసిన్‌’ అనే పదం ఎక్కువగా ఉపయోగించినట్లు,.. మెడిసిన్‌ అంటే పేలుడు పదార్థాలేనని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ప్రకారం మెడిసిన్‌ అంటే వేరేదేమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఓ  మెసేజ్‌లో మేడమ్ X నుంచి షాహిన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌లో ‘ఆపరేషన్‌కు ఔషధం కొరత ఉండకూడదు’ అని ఉంది.  

‘హమ్దర్ద్’ అంటే 
ఇంకొక మెసేజ్‌లో మేడమ్ జెడ్ ‘మేడమ్ సర్జన్, ఆపరేషన్ హమ్దర్ద్‌పై మరింత శ్రద్ధ పెట్టండి’అని పేర్కొనడం గమనార్హం.‘ఆపరేషన్ హమ్దర్ద్’ అనేది మహిళా ఉగ్రవాదులను నియమించేందుకు రూపొందించిన ప్రణాళికగా గుర్తించారు. ‘హమ్దర్ద్’ అంటే ఉర్దూలో సానుభూతి పరులని సమాచారం.   

డాక్టర్‌ షాషీన్‌ లక్నోలోని లాల్ బాగ్ నివాసి. పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి నాయకత్వం వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 2001లో పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్‌ ఈ ముఠాను నడిపినట్టు సమాచారం.

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

కాగా, షాహీన్‌ గతంలో కాన్పూర్ మెడికల్ కాలేజ్లో ఫార్మకాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. అనంతరం ఆమె కన్నౌజ్ మెడికల్ కాలేజీకు బదిలీ అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కు గంటల ముందు ఉమర్ మహ్మద్‌ హ్యూందయ్‌ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకున్నాడు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)