Breaking News

Delhi: యజమాని తిట్టాడని.. అతని ఐదేళ్ల కుమారునిపై పాశవిక దాడి

Published on Wed, 10/22/2025 - 10:31

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ‍ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక డ్రైవర్‌ అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రే​కెత్తించింది.  

నరేలా ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారిపై పగతీర్చుకునేందుకు అతని దగ్గర పనిచేసే డ్రైవర్‌ నీతు తన యజమాని ఐదేళ్ల కుమారుడిపై ఇటుకలతో దాడి చేసి, కత్తితో తీవ్రంగా గాయపరిచి, హత్య చేశాడు. యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే డ్రైవర్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ముందు అతను ఆ బాలుడిని కిడ్నాప్‌ చేసి, తన గదిలో ఉంచాడు. ఆ గదిలోని బాలుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ హత్య అనంతరం నిందితుడు నీతు పరారయ్యాడు. అతనిని వెదికేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నీతూను అతని యజమాని తీవ్రంగా మందలించిన దరిమిలా అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 
నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు బాలుని కిడ్నాప్‌పై ఫోన్‌లో ఫిర్యాదు వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హరేశ్వర్ స్వామి తెలిపారు. బాలుడు తమ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అదృశ్యమయ్యాడని ఫిర్యాదులో తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు, ఇంటి చుట్టుపక్కలవారు బాలుని కోసం గాలించగా, అతని మృతదేహం అక్కడికి సమీపంలోని నీతు గదిలో కనిపించిందని హరేశ్వర్ స్వామి వివరించారు.

బాలుని తండ్రి ఎనిమిది రవాణా వాహనాలను నడుపుతూ, నీతు, వసీంలను డ్రైవర్లుగా నియమించుకున్నాడని, సోమవారం సాయంత్రం, మద్యం మత్తులో ఇద్దరు డ్రైవర్లూ గొడవ పడ్డారని, దీనిలో జోక్యం చేసుకున్న యజమాని.. డ్రైవర్‌ నీతును  కొట్టాడని హరేశ్వర్ స్వామి చెప్పారు. ఈ అవమాన భారంతో నీతు  ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడన్నారు. ఈ  ఉదంతం గురించి తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్‌ గన్‌లతో తక్షణ చర్యలు

#

Tags : 1

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)