Breaking News

ఢిల్లీ పేలుడు ఘటన.. మరో కారు స్వాధీనం

Published on Wed, 11/12/2025 - 19:42

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం(నవంబర్‌ 10వ తేదీ) రాత్రి జరిగిన భారీ పేలుళ్లలో అక్కడికక్కడే తొమ్మిది మంది దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు అసువులు బాశారు. ఈ ఉగ్ర కార్యకలాపాలకు కారణమైన ఒక్కొక్కరినీ స్పెషల్‌ టీమ్స్‌ అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో కారును స్వాధీనం చేసుకున్నారు. 

హరియాణాలోని ఖండవాలీ గ్రామంలో రెడ్‌ పోర్డ్‌ ఈకోస్పోర్ట్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్‌ ఉమర్‌దిగా గుర్తించారు.  ఆ కారు  సదరు గ్రామంలో ఓ ఇంటి బయట పార్క్‌ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేసి చూడగా అది ఉమర్‌ మహ్మద్‌కు చెందినిదిగా కనుగొన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కారులోనే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. 

ఇదిలా ఉంచితే,  ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

 సోమవారం రాత్రి జరిగిన పేలుడు ధాటికి సమీప మార్కెట్‌లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. 

మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)