Breaking News

ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి..

Published on Wed, 11/19/2025 - 09:07

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబి.. పేలుడుకు వారం ముందు నుంచి తన ప్రణాళికను అమలు చేస్తూ వచ్చాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. నవంబర్ 10న దాడి జరగగా, దానికి వారం రోజుల ముందు ఉమర్‌ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గల తన ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే ముందు తన వద్ద ఉన్న రెండు ఫోన్‌లలో ఒకదానిని తన సోదరునికి ఇచ్చాడు.

శ్రీనగర్, ఫరీదాబాద్‌లలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఉమర్‌ సహచరులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టు చేయడంతో ఉమర్‌ సోదరుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఆ మర్నాడు  ఉమర్‌ మరో సహోద్యోగి డాక్టర్ షాహీన్ సయీద్ కూడా అరెస్టు అయినట్లు  ఉమర్‌ సోదరునికి తెలిసింది. ఉమర్‌ కోసం కూడా  పోలీసులు  వెతుకుతున్నారని తెలుసుకున్న సోదరుడు భయంతో  ఉమర్‌ ఇచ్చిన ఫోన్‌ను వారి ఇంటి సమీపంలోని ఒక చెరువులో పడేశాడు. దర్యాప్తు అధికారులు ఉమర్‌ ఫోన్‌ల కోసం గాలించారు. ఆ రెండు ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని, వాటి చివరి స్థానాలు ఢిల్లీ, పుల్వామాలో ఉన్నట్లు గుర్తించారు.

అధికారులు పుల్వామాలోని  ఉమర్‌ ఇంటికి చేరుకుని అతని సోదరుడిని విచారించగా, అతను చెరువులో పడేసిన ఫోన్‌ గురించి వెల్లడించాడు. నీటిలో పడి, పాడైపోయిన ఆ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ మదర్‌బోర్డ్ కూడా పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, అధికారులు అతి కష్టం మీద.. ఆ ఫోనులో.. ఉమర్‌ ఆత్మాహుతి బాంబు దాడులను సమర్థిస్తూ చేసిన కీలక వీడియోను రికవరీ చేయగలిగారు. మంగళవారం బహిర్గతమైన ఆ వీడియోలో.. ఇస్లాంలో ఆత్మహత్యను నిషేధించినప్పటికీ, ఉమర్‌  దానిని సమర్థిస్తూ  బలిదాన చర్యలుగా అభివర్ణించాడు. అలాగే మరణానికి భయపడవద్దు అనే సందేశాన్ని వినిపించాడు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ కొత్త డ్రామా.. డీల్స్‌ కోసం ‘ఎంబీఎస్‌’కు క్లీన్‌చిట్‌

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)