Breaking News

ఢిల్లీ ఎమ్మెల్యే ‘క్లీన్‌’ బౌల్డ్‌

Published on Tue, 10/28/2025 - 10:39

నదిలో రీల్స్‌ చేస్తున్న సమయంలో ఢిల్లీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నదిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరగా.. రాజకీయంగానూ సెటైర్లు పేలుతున్నాయి. 

ఢిల్లీ పట్‌పర్గంజ్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర సింగ్‌ నేగి(Ravi Negi) యుమునా నది నీటిలో జారిపడిపోయారు. నది శుభ్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా రీల్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  అయితే.. అదృవశాత్తూ ఆయనకేం కాలేదు. చట్‌ పూజ వేళ యుమునా నది కాలుష్యంపై రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది.

సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సెటైర్లు సంధిస్తోంది. బీజేపీ నేతలకు ఉత్త హామీలివ్వడం పనిగా మారింది. బహుశా ఆ అబద్ధపు రాజకీయాలకు విసిగిపోయిన యమునమ్మే ఇలా చేసిందేమో అంటూ ఆప్‌ ఎమ్మెల్యే సంజీవ్ ఝా  వ్యాఖ్యానించారు. 

యమునా నది పరిశుభ్రంగా ఉందంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. అయితే.. అంత శుభ్రంగా ఉంటే ఆ నది నీటిని తాగాలంటూ ఆప్‌ ఢిల్లీ చీఫ్‌ సౌరభ్‌ భరద్వాజ్‌ సవాల్‌ విసిరారు. అంతేకాదు.. బాటిల్‌ నీటితో సీఎం నివాసానికి చేరి నిరసన చేపట్టారు. ఈ ఆరోపణలు, కౌంటర్‌లు కొనసాగుతున్న వేళ.. యమునా నీరు శుభ్రమైందని నిరూపించే క్రమంలోనే ఎమ్మెల్యే రవీంద్ర సింగ్‌ ఇలా నీళ్లలో పడిపోయారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)