Breaking News

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోరం.. ప్రమాదానికి కారణమిదే!

Published on Tue, 12/16/2025 - 07:28

ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మంగళవారం తెల్లవారు ఝామన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచు కారణంగా తెలుస్తోంది. భారీ పొగమంచులో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీ కొట్టుకోగా.. ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. 

ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం వేకువజామున 4గం. ప్రాంతంలో ఆగ్రా-నోయిడా లేన్‌ 127వ మైలురాయి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మూడు కార్లు వరుసగా ఢీ కొట్టకున్నాయి. ఆ తర్వాత ఏడు బస్సులు ఢీ కొట్టుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సుల్లో ఒకటి ఆర్టీసీ ఉండగా.. మిగతా ఆరు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సులు. మొత్తం 7 బస్సులు.. నాలుగు కార్లు మంటల్లో చిక్కకుని బూడిదయ్యాయి.

ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి పలువురు సురక్షితంగా బయటపడగా.. నిద్రలో ఉండడం, ఒక్కసారిగా మంటల ఎగసి పడడం, వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి బయటపడలేని స్థితిలో పలువురు సజీవ దహనం అయ్యి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన 11 ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ  ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీ-ముంబై  రహదారిపైనా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నుహ్‌(హర్యానా) వద్ద సోమవారం ఉదయం 5గం. ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకున్నాయి. రెండు ఓవర్‌లోడెడ్‌ డంపర్లు యాక్సిడెంట్‌కు గురి కాగా.. ఆ వెనక 20 దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. సుమారు 20 మంది దాకా గాయాలయ్యాయి. పొగ మంచు వరుస ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వాహనదారులకు సూచిస్తున్నాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)