Breaking News

‘పీఓకే’పై రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

Published on Tue, 01/14/2025 - 17:08

జమ్ము:పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్‌(Jammukashmir) అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnathsingh) అన్నారు.అఖ్నూర్‌ సెక్టార్‌కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్‌ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్‌ డే నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ పాకిస్తాన్‌(Pakistan) అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.

పాకిస్తాన్‌కు పీఓకే విదేశీ భూభాగం అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు.అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారు చేస్తోందని మండిపడ్డారు.పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రధాని చౌదరి అన్వర్‌ ఉల్‌ హఖ్‌ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్‌ తీవ్రంగా ఖండించారు.కశ్మీర్‌ పట్ల గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయన్నారు.దీంతో ఇక్కడి సోదరసోదరీమణులు ఢిల్లీకి చేరువ కాలేకపోయారన్నారు. 

దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానించడం మా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌ ప్రజలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని చెరిపివేసేలా ఆయన పని చేస్తున్నారని ప్రశంసించారు.

గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో భాగమేనని, తాము దానిని దానిని తీసుకుంటామన్నారు.  2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్‌లో శాంతి నెలకొందన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తోందన్నారు.  

కాగా,పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ గతంలో తప్పు పట్టింది. పాకి‌స్తాన్‌లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉండడం గమనార్హం. 


 


 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)