Breaking News

గాడిద మృతితో గందరగోళం.. 65 మందిపై కేసు నమోదు

Published on Sat, 09/21/2024 - 10:47

బక్సర్: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక గాడిద మృతి అనంతరం గందరగోళం చెలరేగింది.  ఇది పోలీసుల వరకూ చేరడంతో వారు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 65 మందిపై కేసు నమోదు చేశారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని కేసత్ బ్లాక్‌లో విద్యుదాఘాతం కారణంగా గాడిద మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలోనివారు ఆందోళనకు దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించారు. ఈ దరిమిలా పోలీసులు 65 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుభమ్ ఆర్య మీడియాకు తెలియజేస్తూ సంఘటన జరిగిన వెంటనే చకోడా పవర్ గ్రిడ్ స్టేషన్‌కు చేరుకున్న పలువురు గ్రామస్తులు మృతిచెందిన గాడిదకు సంబంధించిన పరిహారం  వెంటనే ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. కొందరు గ్రామస్తులు పవర్ గ్రిడ్ కార్యాలయంలోకి ప్రవేశించి, ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

అనంతరం  ప్రభుత్వ ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ సీనియర్ అధికారి పోలీసులకు గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన 65 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా..

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)