‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్‌..

Published on Mon, 08/21/2023 - 09:43

ఓ తండ్రి తన కుమార్తె మృతదేహానికి తల కొరివి పెట్టేందుకు అంతా సిద్ధం చేశాడు. ఆ ఇంటిలో మౌనం తాండవిస్తోంది. నెల రోజుల క్రితం అతని కుమార్తె ఇంటి నుంచి మాయమయ్యింది. తరువాత వారు ఒక మృతదేహానికి సంబంధించిన దుస్తులను చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. దీనిపై స్థానికులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఇంతలో ఆ తండ్రికి..‘నాన్నా నేను బతికే ఉన్నాను. చనిపోలేదు’ అంటూ కుమార్తె దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని అక్బర్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంశు కుమారి నెలరోజుల క్రితం ఇంటి నుంచి మాయమయ్యింది. 

కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్నిచోట్లా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే రెండు రోజుల క్రితం పోలీసులు ఒక యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అంశు కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి  ఉన్న దుస్తులు చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. ఆ మృతదేహం నీటిలో దొరికిన కారణంగా ముఖం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. దీంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది.  అంశు తండ్రి ఆ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. 

ఇంతలో ఆ తండ్రి మొబైల్‌కు ఒక వీడియో కాల్‌ వచ్చింది. దానిలో ‘నాన్నా.. నేను బతికే ఉన్నాను’ అంటూ అతని కుమార్తె తెలిపింది. అంతే .. అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడున్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరిగి అతని కుమార్తె ఫోనులో.. తాను తన ప్రియుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో.. ఇంటి నుంచి పారిపోయానని తెలిపింది. ప్రస్తుతం అత్తవారింట్లో ఉన్నానని పేర్కొంది. అయితే పోలీసులకు లభ్యమైన ఆ యువతి మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు వారికి సవాల్‌గా నిలిచింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. 
ఇది కూడా చదవండి: కాఫీ షాప్‌లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం!

Videos

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)