Breaking News

‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’

Published on Wed, 05/15/2024 - 12:57

వార్తా పత్రికల్లో వివాహాలకు సంబంధించిన ఆసక్తికర ప్రకటనలను చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రకటన గురించి గతంలో ఎప్పుడూ వినివుండం. ఒక జంట 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు వరుణ్ణి వెదుతున్నట్లు ఒక ప్రకటన ఇచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే దక్షిణ కన్నడ జిల్లాలో 30 ఏళ్ల క్రితం మృతిచెందిన ఓ పసికందు (ఇప్పుడు యువతి అయి ఉండేది) కోసం తగిన వరుడిని వెతుకుతున్నట్లు ఇటీవల ఒక వార్తాపత్రిలో ప్రకటన వెలువడింది.  పుత్తూరుకు చెందిన ఒక కుటుంబం  ఈ ప్రకటన ఇచ్చింది. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు ఎలాగైనా వివాహం చేయాలని ఆ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారు. తమ కుమార్తె అవివాహితగా మృతి చెందిన కారణంగా తమను దురదృష్టం వెంటాడుతున్నదని ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

30 ఏళ్ల క్రితం ఆ దంపతుల కుమార్తె పసికందుగా ఉన్నప్పుడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అప్పటి నుండి వారికి కష్టాలు ఎదురవుతున్నాయట. తమ కుమార్తె వివాహం కాకుండా మృతి చెందడమే తమ కష్టాలకు కారణమని ఆ కుటుంబ నమ్ముతోంది. దీంతో తమ కుమార్తె ఆత్మకు శాంతి కలిగింపజేయాలనే భావనతో ఆ కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి  చేయాలని నిశ్చయించారు.  ఇందుకోసం ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చారు.

‘30 ఏళ్ల క్రితం మరణించిన యువతికి.. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన వరుడు కావలెను. దయచేసి ఇటువంటి వరుడు కలిగిన వారు ఇరు ఆత్మల వివాహానికి సహకరించండి. ఇందుకోసం ఫలానా నంబరుకు ఫోన్‌ చేయండి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఎంతగా ప్రయత్నించినా అటువంటి వరుడు దొరకడం లేదని, అందుకే ఈ ప్రకటన ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)