Breaking News

ఇవాళ నుంచే అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం..!

Published on Wed, 12/31/2025 - 15:59

అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం అంటే, మకర సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప విగ్రహానికి పందళ మహారాజు పంపిన దివ్య స్వర్ణాభరణాలను అలంకరించి, ఆ అద్భుతమైన రూపంలో స్వామిని దర్శించుకోవడం. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది. ఈ దర్శనం మకర జ్యోతి దర్శనానికి ముందు జరుగే తంతు. 

ఇక పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ ఇవాల్టి (డిసెంబర్ 31) నుంచి భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది. ఈ రోజు(డిసెంబర్ 31) నుంచి  జనవరి 11 వరకు ప్రతిరోజూ ఉదయం 5:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు భక్తులు తిరువాభరణాలను దర్శించుకోవచ్చు. అలాగే జనవరి 12న తెల్లవారుజామున 4:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పందలం వలియ కోయిక్కల్ శ్రీ ధర్మశాస్త్ర క్షేత్రంలో తిరువాభరణాల దర్శనం ఉంటుంది. 

అదేరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:00 గంటకు రాజప్రతినిధి నేతృత్వంలో తిరువాభరణాల పేటికలు శబరిమలకు పయనమవుతాయి. సాధారణంగా మండల కాలంలో (నవంబర్ నుంచి జనవరి వరకు) భక్తులు ఈ ఆభరణాలను దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు, ప్రత్యేకించి డిసెంబర్ 31 నుండి జనవరి 11 వరకు దర్శనం ఉంటుంది.

పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ అంటే..
అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాలు (Thiruvabharanam) భద్రపరిచే ప్రదేశం, దీని సంరక్షణ భాద్యత పందలం రాజకుటుంబం వారిది. ఆ ఆభరణాలు మకరజ్యోతి పండుగ సమయంలో శబరిమలకి ఊరేగింపుగా తీసుకెళ్లి..ఆ తర్వాత తిరిగి ఇక్కడికే వస్తాయి. ఈ మాళిగను మండలకాలంలో భక్తులు దర్శించుకోవచ్చు.

(చదవండి: మండల పూజ సీజన్‌లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు)

 

 

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)