Breaking News

డ్యాన్సర్‌ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమం

Published on Sat, 02/14/2026 - 17:42

బిహార్‌లో జరిగిన ఘటన ఒకటి  తీవ్ర దిగ్భ్రాంతిని  రేపింది. ఒక ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేస్తున్న మహిళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్‌లోని భోజ్‌పూర్‌లో చంద్వా తోలా ప్రాంతంలో జరిగిన స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. వేలాదిమంది గుమిగూడిన జనం మధ్యం వేదికపై  న్యృత్య ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో డ్యాన్స్‌ చేస్తున్న నృత్యకారిణిపట్ల కొంతమంది ఆకతాయిలు  నీచంగా ప్రవర్తించారు. ఆమె డ్యాన్స్‌ చేస్తుండగా కొంతమంది నాణేలు విసిరారు. మరికొంతమంది అంతటితో ఆగలేదు.  నాణేలను బలవంతంగా నోటిలోకి దూర్చి, మింగించారు. దీంతో ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి  అయిపోవడంతో  వాతావరణం గందరగోళంగా మారింది. దీంతో పరిస్థితి అదుపు పోలీసులు జోక్యం చేసుకుని,  అత్యవసర చికిత్స కోసం ఆమెను అరా సదర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గొంతు నుండి నాణేలను తొలగించారు. ప్రస్తుతం  ఆమె పరిస్థితి విషమంగా ఉందని,  మరో  24 గంటలు గడవాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

తన  భార్య వేదికపై నృత్యం చేస్తుండగా, కొంతమంది ప్రేక్షకులు పైకి ఎక్కి బలవంతంగా ఆమె నోటిలో నాణేలు పెట్టడంతో  మింగేసిందనీ, వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని బాధితురాలి భర్త రాజు కుమార్ వాపోయారు. ఈ సంఘటనపై పోలీసులు, ఇతర జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షులు , ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బెంగళూరులో తొలి స్టోర్‌ : ఆటోలో స్టైలిష్‌గా ‘నథింగ్‌’ సీఈవో

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)