Breaking News

‘కస్టమ్స్‌’ చేతికి 16 అందమైన పాములు

Published on Mon, 06/30/2025 - 12:03

ముంబై: ప్రయాణికుల మాదిరిగా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. వీరు బంగారం లాంటి విలువైన వస్తువులను తరలిస్తూ కస్టమ్స్‌ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా ముంబైలోని భారత కస్టమ్స్ అధికారులు థాయిలాండ్ నుండి వస్తున్న విమాన ప్రయాణికుడిని స్మగ్లింగ్‌ ఆరోపణలతో అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కస్టమ్స్‌ అధికారులు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. థాయిలాండ్ నుండి భారత్‌కు వస్తున్న ప్రయాణికుని నుండి 16 సజీవ పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.

ఈ సజీవ పాములు విషపూరితం కానివని అధికారులు తెలిపారు. జూన్ ప్రారంభంలో థాయిలాండ్ నుంచి డజన్ల కొద్దీ పాములను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదేవిధంగా కొద్దిరోజుల వ్యవధిలో బల్లులు, సన్‌బర్డ్‌ల తదితర 100 జీవులను తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అధికారులు అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: భారత్‌-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి?

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)