Breaking News

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు

Published on Sat, 09/28/2024 - 14:07

బెంగళూరు: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రద్దైన ఎన్నికల బాండ్ల పేరిట మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు చట్టసభల ప్రతినిధుల న్యాయస్థానం తిలక్‌నగర్‌ పోలీసులను ఆదేశించింది.

కాగా పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మతా సీతారామన్‌ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్షపరిషత్తుకు చెందిన ఆదర్శ్‌ గతంలో తిలక్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సంతోశ్‌ గజానన ధర్మాసనం..నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్‌ 10కి వాయిదా వేశారు.

కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు ఎఫ్‌ఐఆర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ నతేలు, నలీన్‌ కుమార్‌ కటీల్‌, బీఐ విజయేంద్ర పేర్లను కూడా చేర్చారు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో ఒత్తిళ్లు పెంచి కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలతో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎలక్టోరల్ బాండ్లను జాతీయ, రాష్ట్ర స్థాయిలలోని బిజెపి నాయకులు నగదుగా మార్చుకున్నారని తెలిపారు.

కాగా నగదు రూపంలో పార్టీలకు ఇచ్చే విరాళాలకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చే పథకాన్ని కేంద్రప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే,ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఈ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది.  ఇది ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)