Breaking News

బాలుడికి చెంపదెబ్బ.. పోలీస్‌ అధికారి ట్రాన్స్‌ఫర్‌, ఆగిన శాలరీ హైక్‌

Published on Fri, 03/07/2025 - 21:43

గాంధీ నగర్‌ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్‌ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్‌ రిహార్సల్స్‌ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.

ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్‌ నిర్వహిస్తుంటారు. గుజరాత్‌ పర్యటన వేళ గుజారత్‌లోని రతన్‌ చౌక్‌ వద్ద పోలీస్‌ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్‌తో రిహారాల్స్‌ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్‌ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్‌ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్‌ను వెనక్కి తిప్పాడు.

అదే సమయంలో పక్కనే  విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారి ఎస్‌ బీఎస్‌ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి  ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్‌ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. 

సంబంధిత వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అమిత్‌ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్‌ రూంకి ట్రాన్స్‌ఫర్‌ 
చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్‌ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)