Breaking News

ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ.. కాంగ్రెస్‌ కీలక నిర్ణయం

Published on Fri, 01/05/2024 - 07:47

ఢిల్లీ: ఇండియా కూటమి మిత్రపక్షాల ఒత్తిడితో కాంగ్రెస్ ఎట్టకేలకు సీట్ల పంపకాలపై మరో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సీట్ల పంపకం, సర్దుబాట్ల కోసం పార్టీ నేతలు మిత్రపక్షాలకు చేరువవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ వివిధ ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఫోన్‌ చేసి మాట్లాడినట్టు సమాచారం. అంతేకాకుండా అవసరమైతే, ప్రతిపక్ష నేతలను కూడా కలవడానికి కాంగ్రెస్ నేతలు రాష్ట్రాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

ఇక, జనవరి 14న ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముందే సీట్ల పంపకాల ఒప్పందాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  భారత్ జోడో న్యాయ్ యాత్రతోనే కాంగ్రెస్‌ తన ప్రచారాన్ని కొనసాగించాలనే ఆలోచనలో హైకమాండ్‌ ఉన్నట్టు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల జాబితాను కూడా త్వరగా ఖరారు చేయాలని పార్టీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ Vs టీఎంసీ
ఇదిలా ఉండగా.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. కూటమిలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. బెంగాల్​లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, టీఎంసీ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. ఒంటరి పోరుకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. మమత దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రాతిపాదించారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ అసలు రూపం బయటపడింది. ఒంటరిగా పోటీ చేసి గతంలో కంటే అధిక స్థానాలు గెలిచే సత్తా మాకు ఉంది. దానికి మేం సిద్ధంగా కూడా ఉన్నామని స్పష్టం చేశారు.

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఎద్దేవా చేశారు. అధీర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్​ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఇండియా కూటమిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్​కు టీఎంసీ మద్దతిస్తోంది. సీట్లపై మమతా బెనర్జీ తుది నిర్ణయం తీసుకుంటారు. మమతా బెనర్జీ రెండు సీట్లు ఆఫర్ చేస్తే తమకు 8 కావాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. అసెంబ్లీలో 294 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో మీరు ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయారని విమర్శించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)