Breaking News

Boston: ఈసీపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

Published on Mon, 04/21/2025 - 11:49

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. 

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్‌ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్‌ అన్నారు.

‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్‌ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. సోమవారం బ్రౌన్‌ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. 

ఇదిలా ఉంటే.. రాహుల్‌ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్‌ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్‌ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)