Breaking News

వాళ్లు చెయ్యరు.. ఇతరుల్ని చెయ్యనివ్వరు..!

Published on Wed, 12/18/2024 - 04:53

జైపూర్‌: రైతులకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు.. వాస్తవానికి అన్నదాతల కోసం ఏమీ చేయలేదని, ఇతరులను కూడా చేయనివ్వరని ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి బదులుగా ఆ పార్టీ రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఖరికి ఈస్టర్న్‌ రాజస్తాన్‌ కెనాల్‌ ప్రాజెక్టు(ఈఆర్‌సీపీ) ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈఆర్‌సీపీ అసంపూర్తిగా ఇంతకాలం నిలిచిపోవడానికి కాంగ్రెస్సే కారణన్నారు.

 చంబల్‌ నదీ పరివాహక ప్రాంతం నుంచి రాజస్తాన్‌లోని 13 జిల్లాలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘నీటి వివాదాలకు పరిష్కారం వెదకాలని కాంగ్రెస్‌ ఏనాడూ భావించలేదు. మన నదుల్లోని నీరు సరిహద్దులు దాటి వెళుతోంది. కానీ, మన రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనికి పరిష్కారం చూపడం ఇష్టం లేని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి పంపకం వివాదాలను ప్రేరేపిస్తోంది’అని ఆయన అన్నారు. 

రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం జైపూర్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పైవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రూ.46,300 కోట్ల విలువైన ఇంధనం, రహదారులు, రైల్వేలు, జల సంబంధం 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గుజరాత్‌ సీఎంగా ఉండగా నర్మదా నదీ జలాలను సద్వినియోగం చేసుకునేలా పలు ప్రాజెక్టులను తలపెడితే కాంగ్రెస్, కొన్ని ఎన్జీవోలు వాటిని అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాయన్నారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు