Breaking News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే

Published on Wed, 05/07/2025 - 20:24

ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్‌ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్‌ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.

పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.

కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్‌ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్‌ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)