Breaking News

నేడు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో భారీ మార్పులు?

Published on Sun, 02/18/2024 - 07:43

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం.  దానికి నేటి నుంచే శ్రీకారం పడేలా కనిపిస్తోంది.  మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, అతని కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి. 

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ నష్టం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, అతని కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్‌ ఆదివారం (ఫిబ్రవరి 18) బీజేపీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కమల్‌నాథ్‌, నకుల్‌నాథ్‌లు బీజేపీలో చేరవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి.

కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు నకుల్‌నాథ్‌ బీజేపీలో చేసే కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కూడా హాజరుకానున్నారు. కమల్ నాథ్ తనయుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ బయో నుండి కాంగ్రెస్ పేరును తొలగించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కమల్ నాథ్ ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. కమల్‌నాథ్‌కు కంచుకోటగా పేరుగాంచిన చింద్వారాలో ఇది జరిగింది. నకుల్‌నాథ్‌ గట్టిపోటీ  ఎదుర్కొన్నాక విజయం సాధించారు. కమల్‌నాథ్‌ తొమ్మిది సార్లు ఎంపీగా పని చేశారు. ఆయన కుమారుడు నకుల్ నాథ్ 2019 ఎన్నికల్లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)