Breaking News

రాజస్థాన్‌ సీఎంకు షాక్‌.. సొంత పార్టీ ఎమ్మెల్యే వినూత్న నిరసన

Published on Wed, 09/13/2023 - 13:38

ఆధిపత్య పోరు, నేతల మధ్య విబేధాలు వంటి సంక్షోభ సమస్యలతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే నిండా వివాదంలో మునిగిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ సర్కార్‌కు మరో షాక్‌ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే సీఎం అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకత వ్యక్తమైంది. 

గహ్లోత్‌కు నిరసనగా కోటా జిల్లాలోని సంగోడ్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ మంగళవారం గుండు కొట్టించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన మాటలు, సూచలను పట్టించుకోకుండా అవినీతిపరుడైన గనులశాఖమంత్రి ప్రమోద్‌ జైన్‌ భాయకు సీఎం గహ్లోత్‌ మద్దతిస్తున్నారని ఆరోపించారు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గుండు గీయించుకున్న తర్వాత ఆ వెంట్రుకలను సీఎంకు పంపించారు. దాంతోపాటు ఓ లేఖ కూడా పంపారు.

ఖాన్‌ కీ జోప్రియా గ్రామాన్ని కోట జిల్లాలో చేర్చలేదని.. దీంతో సీఎం మీద ఉన్న గౌరవం, విశ్వాసం చచ్చిపోయాయని లేఖలో విమర్శించారు. ‘ఎవరైనా చనిపోతే వారి సన్నిహితులు(బంధువలు) గుండు కొట్టించుకోవడం మన సంప్రదాయం.. అందుకే నేను గుండు గీయించుకుని.. ఆ వెంట్రుకలను మీకు పంపుతున్నా. సీఎం పదవి శాశ్వతం కాదు’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కోటా జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

కాగా రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి, అశోక్ చందన తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ సమస్యలపై ధర్నా చేసిన నాలుగు రోజులకు బుండి జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. కోటా నగరంలోని గుమన్‌పురా ప్రాంతంలోని తన నివాసం వద్ద మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. 
చదవండి: వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)