Breaking News

‘అది అసాధ్యం’.. ఖర్గేకు అమిత్‌షా కౌంటర్‌

Published on Sun, 11/02/2025 - 07:21

న్యూఢిల్లీ: శతజయంతి సంవత్సరంలోకి ఇటీవలే అడుగిడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఈ దేశానికి ఇద్దరు  ప్రధానులను అందించిందని, అయితే ఇంతటి ఘనత కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్‌ చేయడం విచిత్రంగా ఉన్నదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

‘ఆయన (ఎం ఖర్గే) ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాన్‌కు ఎటువంటి కారణం చెప్పలేదు. దేశాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి లక్షలాది మంది యువతకు ఆర్‌ఎస్‌ఎస్‌ స్ఫూర్తినిచ్చిన సంస్థ అని  అందరికీ తెలుసు. దేశభక్తి,  క్రమశిక్షణ విలువలను ఆర్‌ఎస్‌ఎస్‌ పెంపొందించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారని మనం గుర్తించాలి. ఈ కోవకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ఉత్తమ ప్రధానులుగా గుర్తింపు పొందారు’ అని అని అమిత్ షా బీహార్‌ రాజధాని పట్నాలో జరిగిన ‘బీహార్ పవర్ ప్లే కాన్క్లేవ్‌’లో ఎన్‌డీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ఈసీఈఓ రాహుల్ కన్వాల్‌తో అన్నారు.

‘ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీకి బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ.  దీని క్యాడర్ బీజేపీకి ఎంతో అవసరం. దేశాభివృద్ధికి, సమాజానికి సరైన దిశను చూపించేందుకు, దేశంలోని ప్రజలను సమీకరించేందుకు, యువతను దేశం కోసం ముందుకు నడిపించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ సహకారం తప్పనిసరి. ఖర్గే ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాను. కానీ అది ఎప్పటికీ నెరవేరదు’ అని అమిత్ షా పేర్కొన్నారు.

దీనికి ముందు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ‘భారతదేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రధాని మోదీ గౌరవించిస్తే, ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని అన్నారు. దేశంలోని శాంతిభద్రతల సమస్యలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కారణంగానే చోటుచేసుకుంటున్నాయని’ ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని కాంగ్రెస్ సరిగా అనుసరించడం లేదని ప్రధాని మోదీ ఆరోపించిన తర్వాత కాంగ్రెస్ చీఫ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: ఇంగ్లీష్‌, హిందీపై సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)