Breaking News

రాహుల్‌ ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టారా?

Published on Wed, 03/13/2024 - 12:17

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ తాజాగా అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన 43 మంది అభ్యర్థుల పేర్లను  ప్రకటించింది. అయితే ఈ రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీల ఊసే ఎత్తలేదు. 

దీంతో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్‌గానే మిగిలింది. మరోవైపు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాంటూ యూపీ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ హైకమాండ్ ఈ రెండు సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ఆమె బరేలీకి రాలేదు. అయితే ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగాలేదని, అందుకే యాత్రలో పాల్గొనలేకపోయారని పార్టీ నేతలు తెలిపారు. ప్రియాంక ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కూడా వారు అంటున్నారు.

మరోవైపు 2019 ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ ఈసారి రాయ్‌బరేలీపై కన్నేసింది. రాయ్‌బరేలీ రాజకీయాలలో కీలకంగా ఉంటున్న ప్రముఖ నేతలు దినేష్ సింగ్, అఖిలేష్ సింగ్, మనోజ్ పాండేలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇది కాంగ్రెస్‌కు గట్టిపోటీ నిచ్చేలా ఉంది.

రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్‌ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)