బీజేపీపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు

Published on Thu, 07/23/2026 - 09:18

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉత్కంఠగా మారాయి. గత రాత్రి జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు.

తాజాగా అభిజిత్‌ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘కొందరు బయటి వ్యక్తులు మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యం. కొందరు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్ ఎప్పుడూ ప్రజాస్వామ్య నిరసనలకు అందుబాటులో ఉండే ప్రదేశమే’ అని వ్యాఖ్యానించారు.

అలాగే, నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాఠీచార్జ్ అత్యంత దారుణంగా జరిగింది. ఈ చర్యకు బాధ్యులైన పోలీసు అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం. మా ఉద్యమానికి ఇవాళ 34వ రోజు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.

లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షపై కూడా దీప్కే స్పందించారు. ‘వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్షకు ఇవాళ 26వ రోజు. ఆయన ఆరోగ్యం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని భావిస్తున్నాం. అందుకే దీక్ష విరమించాలని కోరుతున్నాం. అయినప్పటికీ మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు.

 

Videos

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)