Breaking News

విజయ్‌ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!

Published on Tue, 06/09/2026 - 08:49

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్‌ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్‌ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. 

తిరునెల్వేలి కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్‌ జి. రామకృష్ణన్‌ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్‌ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్‌ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్‌.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. 

ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్‌ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్‌ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.

అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్‌ రామకృష్ణన్‌ నిరసనగా తన టేబుల్‌పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్‌ ఆర్‌. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్‌ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్‌ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.

కరూర్‌లో జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్‌ ఫొటో పక్కనే స్టాలిన్‌ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్‌ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.

కూనూర్‌లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్‌ ఫొటోతో పాటు స్టాలిన్‌, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

 VIDEO Credits: polimernews

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)