Breaking News

బాపూఘాట్‌ అభివృద్ధికి.. 222.27 ఎకరాలు ఇవ్వండి

Published on Wed, 11/27/2024 - 06:15

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో బాపూఘాట్‌ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపిన ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఏర్పాటు చేయనున్న బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాతి్వకతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బాపూఘాట్‌ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్‌ హబ్, మెడిటేషన్‌ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజావినోద స్థలాలు, ల్యాండ్‌ స్కేప్‌ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్‌ పీస్‌), మ్యూజియంలతో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కోరారు. 

కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి 
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులను మెరుగుపర్చడంలో భాగంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన ఎన్‌వోసీని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్‌ నుంచి పొందిందని వివరించారు. 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని..

ఈ మేరకు విమానాశ్రయ పనులకు, విమానాలు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆదిలాబాద్‌లలోనూ విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో భేటీల్లో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్‌.రఘురామిరెడ్డి, కడియం కావ్య తదితరులు ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)