Breaking News

తీర్పును టెక్నాలజీ మెరుగుపర్చగలగాలి 

Published on Mon, 12/15/2025 - 05:34

కటక్‌(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్‌ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు. 

పెండింగ్‌ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్‌ ఫేక్‌లు, డిజిటల్‌ అరెస్ట్‌ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు. 

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)