Breaking News

చిరాగ్, పెళ్లి చేసుకో!

Published on Mon, 08/25/2025 - 04:16

‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ సభ అనంతరం రాహుల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ పాల్గొన్న మీడియా భేటీ సరదా సన్నివేశాలకు, నవ్వులకు వేదికైంది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఎల్జేపీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు తేజస్వి బదులిస్తూ, ఆయన ఎత్తులను చిత్తు చేస్తానని ధీమా వెలిబుచ్చారు. అయితే, ‘‘ చిరాగ్‌ వయసులో నాకంటే పెద్ద. పెద్దన్నయ్య వంటివాడు. అందుకే తనకు నాదో సలహా. త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది’’ అంటూ నవ్వులు పూయించారు. 

‘‘నీ ఉచిత సలహాలు నాక్కూడా తగులుతున్నాయి, చూసుకో’’ అంటూ రాహుల్‌ చెణుకులు విసరడంతో అంతా మరోసారి గొల్లుమన్నారు. తేజస్వి అంతటితో ఆగకుండా, ‘పెళ్లి చేసుకొమ్మని మా నాన్న(లాలు) కూడా మీకిప్పటికే చాలాసార్లు చెప్పా’రన్నారు. అది నిజమేనని రాహుల్‌ అంగీకరించారు. ‘‘రెండేళ్లుగా లాలూజీని ఎప్పుడు కలిసినా నా పెళ్లి మాటే ఎత్తుతున్నారు. ఆయన సమక్షంలో ఇంకా నా పెళ్లి చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ మరోసారి అందరినీ నవి్వంచారు. ‘‘రాహుల్‌ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియాగాంధీతో మాట్లాడా. రాహుల్‌ను పెళ్లికొడుకుగా చూడాలని మేమంతా ఆరాటపడుతున్నాం. ఆయన బారాత్‌లో మేం డ్యాన్స్‌ చేయాల్సిందే’’ అని లాలు గతంలో అనడం తెల్సిందే. 

బుల్లెట్‌ ర్యాలీలో... రాహుల్‌కు ముద్దు 
అరారియాలో బుల్లెట్‌ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు హఠాత్తుగా దూసుకొచ్చి రాహుల్‌ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు! జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు ఓ ఆగంతకుడు అంత సమీపానికి రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. భద్రతాధికారులు అతన్ని దూరంగా నెట్టడమే గాక చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఇంకెవరూ రాహుల్‌ను సమీపించకుండా వలయంగా మారి భద్రత కల్పించారు. అంతకుముందు కూడా ఓ బాలుడు రాహుల్‌ ర్యాలీగా వెళ్తున్న ఓపెన్‌ టాప్‌ కారుపైకి ఎక్కాడు.  
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)