Breaking News

నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్‌’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ..

Published on Sat, 07/22/2023 - 07:40

భారత్‌- నేపాల్‌ సరిహద్దుల మీదుగా నకిలీ ధృవపత్రాలతో భారత్‌లోకి చొరబడేందుకు ఒక చైనా పౌరుడు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి డార్జిలింగ్‌ మీదుగా భారత్‌ సరిహద్దుల్లోకి అక్రమంగా ‍చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై ఆ వ్యక్తిని అరెస్టు చేశాయి. 

ఉమేష్‌గా మారిన పెంగ్‌ యోంగ్జిన్‌
మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం భారత్‌-నేపాల్‌ సరిహద్దులోగల డార్జిలింగ్‌ స్పెషల్‌ సర్వీస్‌ బ్యూరో(ఎస్‌ఎస్‌బీ) పానీటంకీ అవుట్‌పోస్ట్‌ వద్ద ఒక చైనా పౌరుడిని అరెస్టు చేసింది. అతను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్‌ఎస్‌బీఈ చర్య చేపట్టింది. అరెస్టయిన ఆ చైనా పౌరుని పేరు పెంగ్‌ యోంగ్జిన్‌. ఇతను నేపాల్‌లో ఉమేష్‌ అనే నకిలీ పేరుతో నివసిస్తున్నాడు. ఇదే పేరుతో నేపాల్‌లో పాస్‌పోర్టు కూడా చేయించుకున్నాడు. ఈ పాస్‌పోర్టు ఆధారంగానే ఆ చైనా పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. 

భారత్‌లోకి చొరబాటు వెనుక..
ఎస్‌ఎస్‌బీ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌లో ఉంటున్న ఆ చైనా పౌరుడు అక్కడ పాస్‌పోర్ట్‌ పొందేందుకు స్థానికులు సహాయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌బీ అదుపులో ఉన్న ఆ చైనా పౌరుడిని విచారిస్తున్నారు. అతను అక్రమంగా భారత్‌లోకి ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

నేపాల్‌లో ఉంటూ..
భారత్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలోని పానీటంకీ ప్రాంతం నేపాల్‌లోని కకర్‌వీటా పరిధిలోని డోక్లామా చికెన్‌ నెక్‌కు సమీపంలో ఉంది. ఈ సున్నిత ప్రాంతంలో ఇన్నాళ్లూ నివాసమున్న ఈ చైనా పౌరుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగించాడో తెలుసుకునేందుకు ఎస్‌ఎస్‌బీ ప్రయత్నిస్తోంది. భారత్‌-నేపాల్‌ సరిహద్దు 1850 కిలోమీటర్ల మేర ఉంది. అయితే  ఆ చైనా యువకుడు తాను ఉండేందుకు డార్జిలింగ్‌ సమీపంలోని ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకున్నాడనేది అధికారుల ముందున్న ప్రశ్న. ఈ డోక్లామ్‌ రీజియన్‌ విషయంలో భారత్‌-చైనాల మధ్య వివాదం రగులుతోంది. 

ఏడేళ్లుగా మారుపేరుతో..
భారత్‌లోకి పాక్‌ నుంచి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌ ఉదంతం సంచలనంగా మారిన నేపధ్యంలో భారత ప్రభుత్వం మరింత అ‍ప్రమత్తమయ్యింది. రక్షణ బలగాలు తనిఖీలు మరింత ముమ్మరం చేశాయి. కాగా పెంగ్‌ తన పేరు, గుర్తింపును మార్చుకుని నేపాల్‌లో అక్రమంగా గడచిన ఏడేళ్లుగా ఉంటున్నాడు. తాజాగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన అతనిని అదుపులోకి తీసుకున్న స్పెషల్‌ సర్వీస్‌ బ్యూరో అతనిని సుదీర్ఘంగా విచారిస్తోంది. 
ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)