Breaking News

ఓడిపోయే వ్యక్తిని ఎలా నిలబెడతారు?

Published on Sat, 08/23/2025 - 02:52

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయేలో ఉన్న తాము ప్రతిపక్ష పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఎలా మద్దతిస్తామని, ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి వాళ్లు తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తాము సపోర్ట్‌ చేస్తామని ఆశించడం కూడా కరెక్ట్‌ కాదంటూ ఇండియా కూటమిని విమర్శించారు. ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర సదన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే భాగస్వామిగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయనకు తెలిపారు. అనంతరం అక్కడున్న మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.  

ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది.. 
‘సి.పి.రాధాకృష్ణన్‌ను ఎన్డీయే అభ్యర్థిగా మేమంతా కలిసే నిర్ణయించాం. ఆయన దేశంలో గరి్వంచదగ్గ నేత. దేశానికి, ఆ కుర్చీకి వన్నె తెస్తారు’.. అని చెప్పారు. టీడీపీ మద్దతు ఇస్తుందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ‘గెలిచే అవకాశం లేకపోయినా తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టిన ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. రాష్ట్రంలో మేం, కేంద్రంలో ఎన్డీయే ఉన్నప్పుడు మేం వాళ్లకే కదా మద్దతు తెలిపేది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.  

మరో రూ.5 వేల కోట్లు ఇవ్వండి.. 
మరోవైపు.. చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా రూ.5 వేల కోట్లు అవసరమని ఆమెకు తెలిపారు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (సాస్కి–స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) కింద ఆ నిధులను అందించాలంటూ వినతిపత్రాన్ని అందచేశారు. 

అలాగే, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం.. రూ.250 కోట్ల విడుదలకు ఉత్తర్వులివ్వాలని కూడా కోరారు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ డాక్టర్‌ అరవింద్‌ పనగరియాతోనూ ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)