Breaking News

ఛత్తీస్‌గఢ్‌ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

Published on Sat, 05/25/2024 - 11:17

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అందులో పని చేసేవాళ్లు మృతి చెందారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీయగా.. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. 

బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు శబ్ధం భయంకరంగా వినిపించిందని.. ఆ ధాటికి భయంతో వణికిపోయామని స్థానికులు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఆ శబ్ధం వినిపించిందని.. కొన్ని ఇళ్లు సైతం దెబ్బ తిన్నాయని అంటున్నారు.  భారీగా మంటలతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు పరుగులు తీశారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తోంది. 

ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించింది. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల దేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయని, ఫ్యాక్టరీ లోపల 20 అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు.

కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడు ధాటికి గల కారణాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యే మహారాష్ట్ర థానేలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)