Breaking News

బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు

Published on Mon, 06/01/2026 - 15:51

పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్‌గఢ్‌లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం  నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా  ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్‌గా మారింది.

ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక  ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి  దీపేష్ సాహు  ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.

ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!


 

తన పెళ్లి  కబురును దీపేష్‌ ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. 
‘నా లైఫ్‌ పార్ట్‌నర్‌తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి  ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.


వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ  అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు.  అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్‌ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.

ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)