Breaking News

ChatGPT: ఎన్నికలపై విదేశీ కుట్ర

Published on Sat, 06/01/2024 - 05:38

న్యూఢిల్లీ: భారత్‌లో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ముందు ఓపెన్‌ ఏఐ  సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. ప్రజల అభిప్రాయాలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కృత్రిమంగా ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్‌ కేంద్రంగా జరిగిన కోవర్ట్‌ ఆపరేషన్‌ను అడ్డుకున్నట్టు చాట్‌ జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ ఏఐ ప్రకటించింది. అధికార బీజేపీని విమర్శిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ప్రశంసిస్తూ ‘ఎస్‌టీవోఐసీ’ అనే రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ భారత ఎన్నికలపై కంటెంట్‌ను రూపొందించినట్టు తెలిపింది. 

‘‘భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌ను పొగుడుతూ అభిప్రాయాలను ఎస్‌టీవోఐసీ మే నెలలో వ్యాప్తిలోకి తెచి్చంది. 24 గంటల్లోనే దీన్ని అడ్డుకున్నాం’’అని ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ వేదికలపై ఓ సమూహంతో కూడిన అకౌంట్ల ద్వారా కంటెంట్‌ ఎడిట్, ప్రసారం చేసినట్టు, అలాంటి ఖాతాలను నిషేధించినట్టు ఓపెన్‌ ఏఐ ఓ నివేదిక రూపంలో బయటపెట్టింది. తమ ఏఐ టూల్స్‌ సాయంతో కథనాలు, అభిప్రాయాలను రూపొందించి వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌ తదితర సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేసినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు ‘జీరో జెనో’ అని పేరు పెట్టింది. ఏఐని సురక్షిత అవసరాలకే వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ఆపరేషన్‌ను విచి్ఛన్నం చేసినట్టు తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)