Breaking News

కొనసాగుతున్న ‘ఇండిగో’ సంక్షోభం

Published on Thu, 12/04/2025 - 10:34

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే  200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్‌కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.

ఢిల్లీ 30, బెంగళూరు ఎయిర్‌పోర్టులో 42 విమానాలు రద్దు అయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35 శాతానికి ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విమాన రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యే అవకాశం ఉంది.

బుధవారం నాలుగు నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయనిఅని ఇండిగో అంగీకరించింది. శీతాకాల షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలు కారణమని ఇండిగో చెబుతోంది. కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రమైంది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యం అని ఇండిగో ప్రకటించింది.

ఇదీ చదవండి: భారీ సంఖ్యలో విమానాల రద్దుకు కారణం ఏంటంటే..

నవంబరులో మొత్తం 1,232 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 755 ఫ్లైట్లు క్రూ/FDTL కారణంగా రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్‌స్పేస్ పరిమితుల వల్ల రద్దయ్యాయి. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై ఇండిగోను డీజీసీఏ వివరణ కోరింది. ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించినట్లు వివరించారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)