Breaking News

బీజేపీ Vs కాంగ్రెస్‌.. మన్మోహన్‌ స్మారక చిహ్నంపై రాజకీయం!

Published on Sat, 12/28/2024 - 10:41

ఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల వేళ కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మన్మోహన్‌కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ కోరడంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే లేఖపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. మరోవైపు, అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే మన్మోహన్‌కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో.. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంతిమ సంస్కారాలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని ఖర్గే గుర్తు చేశారు. భారత ప్రజల హృదయాల్లో మన్మోహన్‌ సింగ్ అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవి’ అంటూ ట్విట్టర్‌ వేదికగా వ్యాఖ్యానించారు.

అయితే, ఈ లేఖపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవన్‌ మాట్లాడుతూ..‘స్మారకాలను నిర్మించే సంప్రదాయాల గురించి మోదీకి కాంగ్రెస్ లేఖరాయడం విడ్డూరంగా ఉంది. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీవీకి స్మారకం నిర్మించలేదు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కేవలం ప్రధాని మోదీ ఆయనకు స్మారకం నిర్మించారు. 2024లో భారతరత్న ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చారు. అంతేకాదు, ఢిల్లీలో పీవీ అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ కనీసం చోటు కూడా ఇవ్వలేదని మన్మోహన్ సింగ్ మీడియా సలహదారు సంజయ్ బారు తన పుస్తకంలో రాశారు. ఢిల్లీకి బదులు హైదరాబాద్‌లో నిర్వహించే విషయమై పీవీ పిల్లలతో సంజయ్ మాట్లాడానని తెలిపారు’ అని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. స్మారక చిహ్నంపై కేంద్రం హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించింది కేంద్రం. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది మాట్లాడుతూ..‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్మారక స్థలి నిర్మాణానికి  అవసరమైన భూమి, ట్రస్టు ఏర్పాటుకు కొంత సమయం పడుతుంది. కేంద్ర క్యాబినెట్ స్మారక స్థలి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేకు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తాము. మన్మోహన్ జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవించలేదు. ఇప్పుడు ఆయన స్మారక నిర్మాణంపై  రాజకీయాలు చేస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)