సంచార్‌ సాథీ యాప్‌.. కేంద్రం యూటర్న్

Published on Wed, 12/03/2025 - 16:14

ఢిల్లీ: సంచార్‌  సాథీ యాప్‌ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. మెబైల్స్‌లో  ప్రీ​-ఇన్‌స్టాలేషన్‌ నిబంధనను కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరికాదని కేంద్రం తెలిపింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ఇవాళ(డిసెంబర్‌ 3, బుధవారం) ప్రకటించింది.

సంచార్‌ సాథీ యాప్‌ ప్రీ ఇనస్టాలేషన్‌ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా, కొత్త మొబైల్‌ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్‌ సాథీ యాప్‌ని ప్రీ–ఇన్‌స్టాల్‌ చేయాలంటూ హ్యాండ్‌సెట్‌ కంపెనీలకిచ్చిన ఆదేశాలపై విమర్శలు రావడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది కూడా.. యూజర్లు కావాలంటే దీన్ని అట్టే పెట్టుకోవచ్చని, వద్దనుకుంటే డిలీట్‌ కూడా చేయొచ్చని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

సైబర్‌ మోసాల నుంచి రక్షణ కల్పించే ఈ యాప్‌ గురించి చాలా మందికి ఇంకా తెలియదని, వారందరికీ దీన్ని చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టే ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ‘ఈ యాప్‌ని అందరికీ చేరువ చేయడం మా బాధ్యత. మీరు డిలీట్‌ చేయదల్చుకుంటే చేయొచ్చు. వాడకూడదనుకుంటే రిజిస్టర్‌ చేసుకోవద్దు. రిజిస్టర్‌ చేసుకుంటే యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే ఇనాక్టివ్‌గా ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.

మోసాలపై సత్వరం ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్‌ సాథీ యాప్‌ను కొత్తగా తయారు చేసే అన్ని మొబైల్‌ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ–ఇన్‌స్టాల్‌ చేయాలని, ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా ఇన్‌స్టాల్‌ చేయాలని హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థలను టెలికం శాఖ (డాట్‌) ఆదేశించిన సంగతి తెలిసిందే.  సంచార్‌  సాథీ యాప్‌కి సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)