2025 వెడ్డింగ్స్‌.. రాయల్‌గా పెళ్లి..రీల్స్‌ మళ్లీ మళ్లీ!

Published on Thu, 12/25/2025 - 06:12

బంగారం ధర కొండెక్కి కూర్చుంది.. వెండి వెల వెలుగులు జిమ్ముతోంది.. అయితే ఏంటట..? పెళ్లి మాత్రం ‘రాయల్‌’గా జరగాల్సిందే.. 2025 వెడ్డింగ్‌ సీజన్‌ కేవలం మూడు ముళ్ల ముచ్చట కాదు.. ఇప్పుడు అదొక భారీ ‘ఇన్‌స్ట్రాగామ్‌ ఈవెంట్‌’. స్మృతి మంధాన, పలాష్‌ ముచ్చల్‌ వంటి ప్రముఖుల పెళ్లిళ్లు ఆగిపోయి వార్తల్లో నిలిచినా.. అదర్‌ జైన్, అర్మాన్‌ మాలిక్‌ వంటి స్టార్ల పెళ్లి సందడి ట్రెండ్‌ సెట్‌ చేసింది.

 కేవలం కోటీశ్వరులే కాదు, మధ్యతరగతి జంటలు కూడా ’లగ్జరీ’ బాట పట్టడంతో వెడ్డింగ్‌ మార్కెట్‌ కళకళలాడుతోంది. ఇప్పుడు పెళ్లి అంటే కేవలం అక్షింతలు వేయించుకోవడం కాదు.. ఇన్‌స్టాలో ట్రెండ్‌ కావడం.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో మెరిసిపోవడం.. ఖర్చు భారమైనా, అప్పులైనా.. పెళ్లి వేడుక మాత్రం ‘బ్లాక్‌ బస్టర్‌’ సినిమా రేంజ్‌లో ఉండాల్సిందేనని కుర్రకారు ఫిక్సయిపోయింది. 

→ ఖర్చులో తగ్గేదే లే!  
‘వెడ్‌మిగుడ్‌’ సంస్థ నివేదిక ప్రకారం.. 2025లో పెళ్లిళ్ల ఖర్చు సగటున 8 శాతం పెరిగింది. ఒక్కో పెళ్లి బడ్జెట్‌ సగటున రూ.39.5 లక్షలకు చేరింది. ఇక 2026లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

→ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కే ఓటు 
ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరు సొంతూరు వదిలి గోవా, జైపూర్‌ లేదా రిషికేష్‌ లాంటి ప్రాంతాల్లో ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ సెలబ్రేట్‌ చేసుకున్నారు. రూ.కోటి మించిన బడ్జెట్‌ ఉన్న పెళ్లిళ్లలో 60 శాతం డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌వే. సగటున ఒక డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం రూ.58 లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాలి, వియత్నాం, థాయిలాండ్‌ వంటి దేశాలు ఇప్పుడు ఇండియన్‌ జంటలకు ఫేవరెట్‌ వెడ్డింగ్‌ స్పాట్లుగా మారిపోయాయి. 

→ రీల్స్‌ కోసమే అసలు గోల.. 
గతంలో లాగా పాత ఫొటోలు, గంటల కొద్దీ వీడియోలు ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు. పెళ్లి పూర్తవగానే నిమిషాల్లో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడానికి వీలుగా ’క్విక్‌ అండ్‌ క్వాలిటీ’ కంటెంట్‌ కావాలి. అందుకే ఫొటోగ్రఫీ శైలి కూడా మారింది. క్యాండిడ్‌ షాట్స్, డాక్యుమెంటరీ స్టైల్‌ వీడియోల కోసం జంటలు ఎగబడుతున్నాయి. ఫొటోగ్రఫీ మార్కెట్‌లో అసైన్‌మెంట్లు కొంచెం తగ్గినా, డిమాండ్‌ మాత్రం పీక్స్‌లో ఉంది. 

→ పాత బంగారానికే జై!  
2025లో బంగారం ధర ఏకంగా 74 శాతం పెరిగి పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ల తండ్రులకు చుక్కలు చూపించింది. వెండి ధర అయితే ఏకంగా 137 శాతం ఎగబాకింది. దీంతో చాలామంది కొత్త నగలు కొనేకంటే, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్లు చేయించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రీసైక్లింగ్‌ ట్రెండ్‌ గతంతో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. 

→ హోటళ్లకు కాసుల వర్షం  
హోటల్‌ రంగం కూడా ఈ వెడ్డింగ్‌ సీజన్‌లో భారీగా లాభపడుతోంది. మునుపటిలా ఒక రోజులో పెళ్లి ముగించకుండా, 2–3 రోజుల పాటు ఈవెంట్లను హోటల్స్‌లోనే ప్లాన్‌ చేస్తున్నారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు సాగే ఈ ‘పెళ్లిళ్ల సీజన్‌’.. హోటళ్ల వ్యాపారంలో దాదాపు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

→ 2026పై గురి..  
ముందుముందు పెళ్లిళ్లలో ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకం పెరగనుంది. ప్రణాళికల నుంచి చెల్లింపుల వరకు అంతా డిజిటల్‌ మయం కాబోతోంది. మొత్తానికి ధరల భారమున్నా.. భారతీయ పెళ్లిళ్ల గ్లామర్‌ మాత్రం తగ్గట్లేదు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)